*రోడ్డు విస్తరణ పేరుతో చెట్ల నరికివేత – అటవీ శాఖ నుండి సమాచారం శూన్యం*
*రోడ్డు విస్తరణ ముసుగులో చెట్ల ఊచకోత*
*ఎన్ని చెట్లకు అనుమతి… ఎన్ని నరికారు? – అటవీ శాఖ మౌనం*
*‘అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం’ పర్యావరణ ప్రేమికుల ఆగ్రహం*
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
మే 04
*ఏన్కూరు*
ఏన్కూరు మండల కేంద్రం ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా దశాబ్దాల నాటి భారీ వృక్షాలను నేలకూల్చారు. అయితే ఎన్ని చెట్లు నరికేందుకు అటవీ శాఖ అనుమతి ఇచ్చింది, వాస్తవంగా ఎన్ని చెట్లు నరికారు అనే వివరాలు అడిగితే ‘మా దగ్గర సమాచారం లేదు’ అంటూ అటవీ శాఖ అధికారులు దాటవేస్తున్నారు.
ఆర్ & బి శాఖ ఆధ్వర్యంలో ఏన్కూరు రోడ్డును రెండు వరుసల నుండి నాలుగు వరుసలుగా విస్తరించే పనులు గత నెలలో ప్రారంభమయ్యాయి
ఈ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కాంట్రాక్టర్ సిబ్బంది యంత్రాలతో నరికేశారు. చెట్ల మొద్దులు దర్శనమిస్తున్నాయి.
వాల్టా చట్టం ప్రకారం రోడ్డు పక్కన ఉన్న ఒక్క చెట్టు నరికేందుకైనా అటవీ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.
ఒక చెట్టు నరికిన ప్రతి చెట్టుకు బదులుగా 10 మొక్కలు నాటి, వాటిని 3 ఏళ్లపాటు సంరక్షించాలని నిబంధన ఉంది అట్టి నిబంధనలను గాలికి వదిలేసిన అటవీశాఖ అధికారులు
చెట్లు నరికే ముందు ఎన్ని చెట్లు, ఏ కారణంతో నరుకుతున్నారో పత్రికా ప్రకటన ఇవ్వాలి. పత్రిక ప్రకటన అనేదే ఇవ్వలేదు మండలంలో ఉన్నటువంటి పాత్రికేయులకు గాని మండల నాయకులకు గాని ఎటువంటి సమాచారం అనేది ఇవ్వలేదు ఇట్టి విషయమై
స్థానికుల నుండి అభ్యంతరాలు స్వీకరించాలి.
ఈ నిబంధనలు ఏన్కూరు లో పాటించారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని చెట్లు నరికేందుకు పర్మిషన్ ఇచ్చారు? జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేశారా? కంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద ఎంత డబ్బు డిపాజిట్ చేశారు?’ అని అటవీ శాఖ తల్లాడ రేంజ్ ఆఫీసర్ ఉమా ను సమాచారం అడిగితే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఫోన్ నెంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది దీని గల కారణాలు ఏమిటో అనేది కూడా ఫారెస్ట్ అధికారి సమాధానం చెప్పాలి
*కాంట్రాక్టర్ మరియు అటవీశాఖ అధికారుల మధ్య రహస్య ఒప్పందాలు*
కాంట్రాక్టర్ కు ఇచ్చిన పర్మిషన్ కంటే ఎక్కువ చెట్లను నరికినట్టుగా స్థానికులు చెబుతున్నారు అటవీశాఖ అధికారులు మామూళ్ల కోసం కాంట్రాక్టర్ నీ ఇబ్బందులకు గురిచేసి ఒక్కరోజు వారి చెట్లకు సంబంధించిన లోడ్ చేసిన లారీని పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది మరల కాంట్రాక్టర్ అటవీ శాఖ అధికారులు ఒప్పందాలు కుదిరించుకొని విడిచిపెట్టినట్టుగా విశ్వసనీయమైన సమాచారం కాంట్రాక్టర్ తీసుకున్న పర్మిషన్ కంటే ఎక్కువ చెట్లను నరికేటప్పుడు అటవీశాఖ అధికారులు ఎక్కడ నిద్రపోతున్నారు అని మండల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అడిగే వారు లేక వారికి ఇష్టం వచ్చినట్టుగా చెట్లను నరికితే సరిపోతుందా ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు
‘50 ఏళ్ల వయసున్న చెట్లు, ఒక్కరోజులో నేలకూలాయి. రోడ్డు విస్తరణ అవసరమే, కానీ అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నరకడం దారుణం. ఇప్పుడు ఎండకు రోడ్డుపై నడవలేకపోతున్నాం’ అని మండల ప్రజలు వాపోయారు.
అనుమతి లేకుండా చెట్లు నరికితే ఒక్కో చెట్టుకు ₹10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంది. ఆర్ & బి కాంట్రాక్టర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు?
నరికిన చెట్ల కలప ఏమైంది? వేలం వేశారా? ఆ సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్లింది?
100 చెట్లు నరికితే 1000 మొక్కలు నాటాలి. ఒక్క మొక్కైనా నాటారా?
అటవీ శాఖ సిబ్బంది స్పాట్‌కి వెళ్లి పంచనామా ఎందుకు చేయలేదు?
ఏన్కూరు రోడ్డులో నరికిన చెట్లపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించాలి.
అనుమతులు లేకుండా చెట్లు నరికిన ఆర్ & బి అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
నరికిన ప్రతి చెట్టుకు 10 చొప్పున మొక్కలు నాటించి జియో ట్యాగింగ్ చేయాలి.
అటవీ శాఖ నిర్లక్ష్యంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
చెట్లు నరకడం కాదు, చట్టాన్ని నరికేశారు.
నిర్లక్ష్యం వహించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇకనుండి ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు

