Friday, 25 September 2026
  • Home  
  • పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు
- తిరుపతి

పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ తాజా ఉత్తర్వుల మేరకు పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎప్పటిలాగే ఇంటి వద్ద నగదు రూపంలో అందజేయనున్నారు. 60 నుంచి 79 ఏళ్ల వృద్ధులకు కేంద్ర వాటా రూ.200, రాష్ట్ర వాటా రూ.3,800 కలిపి మొత్తం రూ.4,000 అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 బ్యాంకులో, రూ.3,500 నగదుగా అందజేస్తారు. వితంతువులకు వయస్సును బట్టి రూ.300 లేదా రూ.500 బ్యాంకులో జమ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదుగా అందించనున్నారు. వికలాంగులకు మొత్తం రూ.6,000 పింఛన్‌ యథావిధిగా కొనసాగుతుంది. 18 నుంచి 79 ఏళ్ల వారికి రూ.300 బ్యాంకులో, రూ.5,700 నగదుగా, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 బ్యాంకులో, రూ.5,500 నగదుగా అందజేయనున్నారు. దీంతో లబ్ధిదారులకు అందే మొత్తం పింఛన్‌లో ఎలాంటి తగ్గింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ తాజా ఉత్తర్వుల మేరకు పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటాను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఎప్పటిలాగే ఇంటి వద్ద నగదు రూపంలో అందజేయనున్నారు.

60 నుంచి 79 ఏళ్ల వృద్ధులకు కేంద్ర వాటా రూ.200, రాష్ట్ర వాటా రూ.3,800 కలిపి మొత్తం రూ.4,000 అందుతుంది. 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 బ్యాంకులో, రూ.3,500 నగదుగా అందజేస్తారు. వితంతువులకు వయస్సును బట్టి రూ.300 లేదా రూ.500 బ్యాంకులో జమ చేసి, మిగిలిన మొత్తాన్ని నగదుగా అందించనున్నారు.

వికలాంగులకు మొత్తం రూ.6,000 పింఛన్‌ యథావిధిగా కొనసాగుతుంది. 18 నుంచి 79 ఏళ్ల వారికి రూ.300 బ్యాంకులో, రూ.5,700 నగదుగా, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 బ్యాంకులో, రూ.5,500 నగదుగా అందజేయనున్నారు. దీంతో లబ్ధిదారులకు అందే మొత్తం పింఛన్‌లో ఎలాంటి తగ్గింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.