డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం పాశర్లపూడిలో తుపాన్ ప్రభావిత వరి చేలును టీడీపీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట పరిస్థితి, నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ కో-కన్వీనర్లు మోకా ఆనందసాగర్, దాసరి వీర వెంకట సత్యనారాయణ, మామిడికుదురు మండల టీడీపీ అధ్యక్షులు బోనం బాబు, జిల్లా ఉపాధ్యక్షులు మొల్లేటి శ్రీనివాస్, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు, జిల్లా నాయకులు, తెలుగు రైతు నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



