Sunday, 27 September 2026
  • Home  
  • తుని రైల్వే స్టేషన్‌లో 13 కేజీల గంజాయి పట్టివేత
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుని రైల్వే స్టేషన్‌లో 13 కేజీల గంజాయి పట్టివేత

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు 13 కేజీల గంజాయిని పట్టుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హౌరా–చెన్నై మెయిల్‌ రైలులోని జనరల్‌ కోచ్‌లో తనిఖీలు నిర్వహించగా, ప్రయాణికుల లగేజ్‌ బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుభద్ర సమాల్‌ (19), దీపక్‌ కుమార్‌ (24)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి తరలిస్తున్నారు అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైల్వే మార్గంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. Uploaded Video:

కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు 13 కేజీల గంజాయిని పట్టుకున్నారు. భువనేశ్వర్‌ నుంచి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హౌరా–చెన్నై మెయిల్‌ రైలులోని జనరల్‌ కోచ్‌లో తనిఖీలు నిర్వహించగా, ప్రయాణికుల లగేజ్‌ బ్యాగుల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుభద్ర సమాల్‌ (19), దీపక్‌ కుమార్‌ (24)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి తరలిస్తున్నారు అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైల్వే మార్గంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.