విశాఖపట్నం, ఆగస్టు 26: అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం చిన్నప్పనపాలెంలో యువకుడు పాము కాటుకు గురై మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పొలంలో ఆవును తోలుకెళ్తుండగా పైలా ప్రసాద్ అనే యువకుడికి పాము కాటు వేసింది. యువకుడునివెంటనే ఆస్పత్రికి తరలిం చకుండా నాటు వైద్యుడిని ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. నాటు వైద్యుడు యువకుని కాలికి పసరు మందు రాసి ఇంటికి పంపించేసాడు. రాత్రి గడిచేకొద్దీ విషం శరీరమంతా వ్యాపించింది. తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ప్రసాద్ మృతి చెందాడు. కుమారుడిని కోల్పోయి కన్నీరుమున్నీరైయాడు తండ్రి. “సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే నా కొడుకు బతికేవాడు” అంటూ తండ్రి ఆవేదన చెందాడు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యాన్ని ఆశ్రయించవద్దని అధికారుల సూచించారు. ఎవరైనా పాము కాటుకు గురైనచో వెంటనే సమీపంలోని ప్రభుత్వ/ అత్యవసర వైద్య కేంద్రానికి తరలించాలి అని వైద్యులు తెలిపారు

పాము కాటుకు నాటు వైద్యం… యువకుడు మృతి