తిరుపతి ఆగస్టు 02 (పున్నమి ప్రతినిధి)
*ఎస్వీయూ వేదికగా ఎస్ఎఫ్ఐ(SFI) ప్లీనరీ సమావేశం*
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రకాశం భవన్ ఎకనామిక్స్ గ్యాలరీలో ఆదివారం ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి *ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భగత్ రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసినం నాగరాజు, సీఐటీయూ తిరుపతి నగర కార్యదర్శి మాధవ్ కృష్ణ, వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున* ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వారు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం యువత మరో Gen Z పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. NEP-2020తో విద్య ప్రైవేటీకరణ వేగవంతమవుతోందని, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
*ఇట్లు*
*భారత విద్యార్థి ఫెడరేషన్* ( *SFI* )
*తిరుపతి జిల్లా కమిటీ*




