Sunday, 20 September 2026
  • Home  
  • మూలారెడ్డి సేవలు చిరస్మరణీయం: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
- తూర్పు గోదావరి

మూలారెడ్డి సేవలు చిరస్మరణీయం: నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు.. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఉచిత వైద్య శిబిరం ప్రారంభం బలభద్రపురం, ఆగస్టు 2 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా బలభద్రపురంలోని ఎంఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆయన విగ్రహానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. అనంతరం నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, సంస్కార్ ఫౌండేషన్, ఇండియా టర్న్స్ పింక్ ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవా కార్యక్రమాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ సనాతన సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్న ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి, తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ గుడిమెట్ల రామచంద్రారెడ్డికి నల్లమిల్లి మూలారెడ్డి స్మారక పురస్కారాలను నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, మూలారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులు.. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

బలభద్రపురం, ఆగస్టు 2 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి): మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా బలభద్రపురంలోని ఎంఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆయన విగ్రహానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకులు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. అనంతరం నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, సంస్కార్ ఫౌండేషన్, ఇండియా టర్న్స్ పింక్ ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సేవా కార్యక్రమాన్ని, ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. రమాదేవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రభుత్వ వైద్యుల ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ సనాతన సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్న ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి, తాడేపల్లిగూడెంకు చెందిన ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ గుడిమెట్ల రామచంద్రారెడ్డికి నల్లమిల్లి మూలారెడ్డి స్మారక పురస్కారాలను నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, మూలారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.