శ్రీ కాళహస్తి, మే 28, (పున్నమి న్యూస్) : జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిత్య అన్నదాన వితరణ విజయవంతంగా 83వ వారానికి చేరుకుంది. సమాజంలో ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ గుప్పెడు మెతుకులు అందించాలనే పవన్ కళ్యాణ్ సేవా దృక్పథానికి మద్దతుగా జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నదాన నిర్వాహకులు మాట్లాడుతూ.. నిరుపేదల ఆకలి తీర్చడమే పరమావధిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవ చేయడమేనని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి వారం ఈ అన్నదానాన్ని బాధ్యతగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు జరిగిన అన్నదానంలో స్థానిక ప్రయాణికులు, నిరుపేదలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మణి, హరి, దినేష్, లక్ష్మణ్, నవీన్ పాల్గొన్నారు. వీరితో పాటు జనసేన వీర మహిళలు పేట శారద, నారాయణ గాయత్రి, బత్తెమ్మ తదితరులు పాల్గొని అన్నదాన వితరణను పర్యవేక్షించారు.

పవన్ కళ్యాణ్ ఆశయంతో అన్నదానం-శ్రీకాళహస్తిలో 83వ వారం కార్యక్రమం