ఖమ్మం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు, రేపు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనడంతో పాటు, వివిధ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో మంత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.



