పున్నమి న్యూస్ ప్రతినిధి కృష్ణ* జూలై 30 సూళ్లూరుపేట నియోజకవర్గ
తెలుగుదేశం పార్టీతోనే,అభివృద్ధి,సంక్షేమసాధ్యం,ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో తెలుగుదేశం,పార్టీతోనే అభివృద్ధి,సంక్షేమ సాధ్యమవుతుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ తెలియజేశారు.గురువారం నాయుడుపేట మున్సిపాలిటీలోని 19,20 వార్డుల్లో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి-సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి,ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ,మాజీ ఎంపీ నెలవలసుబ్రహ్మణ్యం లు పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని గోమతి సెంటర్ నుండి బి డీ కాలనీ వరకు ఎమ్మెల్యే సైకిల్ తొక్కి ర్యాలీనిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నలవల విజయ శ్రీ,జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి,మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను రెండేళ్ల పాలనలో విజయవంతంగా అమలు చేశారని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ,ప్రధాన కార్యదర్శి అవధానం సుధీర్,తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టావెంకటరమణారెడ్డి, పసల గంగా ప్రసాద్,ఆమవరపు సత్యం,పోట్లపూడి రాజేష్,శ్రీ పోలేరమ్మ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నిత్య కృష్ణారెడ్డి,పలుకూరు ముత్యాలయ్య,కుబేరుమణి , గోను బాబు,వినుకొండ ధనుంజయ,ఇమ్మడిశెట్టివెంకటేశ్వర్లు,మొండెం బాబు, చేవూరుచెంగయ్య,పలువురుపాల్గొన్నారు



