నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు : ఏడీఏ కరుణశ్రీ
ఏన్కూరు మండలంలోని రేపల్లెవాడ, మేడేపల్లి గ్రామాల్లో వైరా ఏడీఏ కరుణశ్రీ పర్యటించారు. నకిలీ, గ్లైసిల్ బీటీ పత్తి విత్తనాలు వాడొద్దని రైతులకు సూచించారు. అలాంటి విత్తనాలతో పంటలతో పాటు ఆరోగ్యానికి కూడా ముప్పు ఉంటుందన్నారు.
గ్రామాల్లో ఇలాంటి నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంలో సర్పంచులు ప్రధాన బాధ్యత వహించాలని సూచించారు. గ్రామాల్లోకి వచ్చి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి సమాచారం తెలిసిన వెంటనే మండల వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని కోరారు.
పంట అవశేషాలు కాల్చవద్దని, ఫార్మర్ రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నరసింహారావు, ఏఈఓలు లహరి, కరుణాకర్, అశోక్, రైతులు పాల్గొన్నారు.

