03-06-2026
నందిపాడు
బుధవారం, శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు, దుత్తలూరు మండల కన్వీనర్ శ్రీ ఉండేల గురువారెడ్డి గారి సూచనలతో ఉదయగిరి నియోజకవర్గం, దుత్తలూరు మండలం, నందిపాడు గ్రామంలో యూనిట్ స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని యూనిట్ ఇన్‌చార్జ్ శ్రీ చప్పిడి హాజరత్తయ్య యాదవ్ గారు అత్యంత విజయవంతంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి దుత్తలూరు మండలం EX MPP శ్రీకుర్తి రవీంద్ర బాబు , నందిపాడు PACS చైర్మన్
మండవ మధు, మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్ లు, మాజి సర్పంచ్ లు,సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.
సమావేశంలో క్రింది అంశాలపై సవివరంగా చర్చించాము:
🔸 రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం.
🔸 ఓటరు జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు మరియు బూత్ స్థాయి బాధ్యతలపై చర్చ.
🔸 స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు


