*ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి*నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనల కారణంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని నియమించారు.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రస్తుతం ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన గెజిట్ ప్రకారం.. ”ప్రధానమంత్రి సలహా మేరకు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 75లోని క్లాజ్ (2) ప్రకారం కేంద్ర క్యాబినెట్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను భారత రాష్ట్రపతి తక్షణమే ఆమోదించారు.. అంతేకాకుండా, ప్రధాని సలహా మేరకు మరో క్యాబినెట్ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషికి, ఆయన ప్రస్తుత పోర్ట్‌ఫోలియోతో పాటు విద్యా శాఖ బాధ్యతలను కూడా అప్పగించాలని రాష్ట్రపతి ఆదేశించారు” అని పేర్కొన్నారు.ఎవరీ ప్రహ్లాద్ జోషి?బీజేపీలో సీనియర్ నాయకుడైన ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధర్వాడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ మంత్రివర్గంలో ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ, న్యూ అండ్ పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాదు, అంతర్జాతీయ సౌర కూటమికి ఆయన అధ్యక్షుడిగానూ ఉన్నారు. మోదీ 2.0లో బొగ్గు గనుల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా చేశారు.నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోరుతూ దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ప్రహ్లాద్ జోషికి మోదీ విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించడం కీలకంగా మారింది. పరీక్షల నిర్వహణలో విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంపొందంచడం సహా విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం బాధ్యతలు తీసుకుంటున్న జోషి ఏ మేరకు కృషి చేస్తారో చూడాలి మరీ. కాక్రోచ్ జనతా పార్టీ మూడు డిమాండ్లలో విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ లీక్‌తో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం, ఉద్యమం సమయంలో విద్యార్థులపై పెట్టిన కేసులు కొట్టివేయడం. ఈ మూడింటికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో ఆందోళనలను విరమిస్తున్నట్టు కాక్రోజ్ జనతా పార్టీ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సీజేపీ ప్రతినిధులు సౌరబ్ దాస్, అశుతోష్ రాంకీ సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
రిపోర్టర్ పున్నమి వినోద్ కుమార్


