మధిర / ఖమ్మం
మధిర: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధిర పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మర్సకుంట్ల స్వర్ణకర్ పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. దేశ ప్రజల సంక్షేమం, అంత్యోదయ సాధన కోసం దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివరాజు సుమంత్, పాపట్ల రమేష్, చిలివేరు సాంబశివరావు, రవీంద్ర, భవాని, మేరి తదితరులు పాల్గొన్నారు.



