హైదరాబాద్ /ఖమ్మం
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి నున్న రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాకు గౌరవ వందనం చేసి, దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్లను నున్న రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



