విశాఖపట్నం జిల్లా ఆనందపురం (పున్నమి ప్రతినిధి ), ఆగస్టు 15:
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్‌జీ ఫౌండేషన్ శివ దళాయి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు గుర్తింపు కార్డులను అందజేశారు.
విద్యార్థుల భద్రత, పాఠశాల పట్ల వారిలో బాధ్యతాభావం పెంపొందించడంతో పాటు, ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు నిమ్మకాయల జయరాం, సచివాలయ కార్యదర్శి ప్రసాద్, మాజీ సర్పంచ్ భావిశెట్టి భారతమ్మ, విద్యావేత్త భావిశెట్టి రాజు, ముదిలి చిన్నయ పాత్రుడు, అచ్చింనాయుడు, నిమ్మకాయల అప్పలరాజు, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

ఓ ఎస్ జి ఫౌండేషన్ శివ దళాయి ఆధ్వర్యంలో విద్యార్థులకు గుర్తింపు కార్డులు పంపిణీ
విశాఖపట్నం జిల్లా ఆనందపురం (పున్నమి ప్రతినిధి ), ఆగస్టు 15: భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్‌జీ ఫౌండేషన్ శివ దళాయి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు గుర్తింపు కార్డులను అందజేశారు. విద్యార్థుల భద్రత, పాఠశాల పట్ల వారిలో బాధ్యతాభావం పెంపొందించడంతో పాటు, ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు నిమ్మకాయల జయరాం, సచివాలయ కార్యదర్శి ప్రసాద్, మాజీ సర్పంచ్ భావిశెట్టి భారతమ్మ, విద్యావేత్త భావిశెట్టి రాజు, ముదిలి చిన్నయ పాత్రుడు, అచ్చింనాయుడు, నిమ్మకాయల అప్పలరాజు, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

