పున్నమి ప్రతినిధి తాళ్లపూడి, తూర్పుగోదావరి జిల్లాఏప్రిల్ 29:తూర్పు గోదావరి జిల్లాలో ఇంధన సరఫరా పరిస్థితులపై అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని దేవరపల్లి మండలం పరిధిలోని గౌరీపట్నం గ్రామంలో ఉన్న HP Petrol Pump ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నర్సింహ కిషోర్ కలిసి పరిశీలించారు.
ఇటీవలి రోజుల్లో డీజిల్ కొరతపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, బంక్ యాజమాన్యాన్ని మరియు సంబంధిత అధికారులను కలెక్టర్, ఎస్పీ ప్రశ్నించారు. డీజిల్ సరఫరా లోపాలకు గల కారణాలు, నిల్వల పరిస్థితి, సరఫరా వ్యవస్థపై సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా, ప్రజలకు ఇంధనం సరఫరా సజావుగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అక్రమ రవాణా, నిల్వల లోపం వంటి సమస్యలు తలెత్తకుండా కఠినంగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా ఇంధన కొరత లేదా అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను అధికారులు కోరారు.


