ఖమ్మం నగరానికి చెందిన బీఆర్‌ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు మహ్మద్ తాజుద్దీన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర, ఖమ్మం కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ఖమ్మం నగర బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షులు పగడాల నాగరాజు తదితరులు తాజుద్దీన్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాజుద్దీన్ మృతి పార్టీకి, మైనారిటీ వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు.



