రేణిగుంట ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి
డెంగ్యూ వ్యాధిని తరిమి కొడదామని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటయ్య మంగళవారం తెలియజేశారు కరకంబాడి గ్రామపంచాయతీ పరిధిలోని సచివాలయం వన్ నందు లార్వా సర్వే కార్యక్రమం తో పాటు దోమల నివారణకు పాగింగ్ చేయడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం అనేది దోమల ద్వారా సంక్రమించే వ్యాధి అన్నారు. ఈ యొక్క వ్యాధి లక్షణాలు అధిక జ్వరం, దద్దర్లు, తలనొప్పి, కండరాలు కీళ్లు నొప్పులు కొన్ని తీవ్రమైన కేసులు రక్తస్రావం షాక్ కు దారితీస్తుందని గుర్తు చేశారు. ఉగాది దోమల ద్వారా వ్యాపిస్తుందన్నారు. ఉగాది సంక్రమిస్తే నాలుగు నుండి ఆరు రోజుల నుండి ప్రారంభమవుతుందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మూరికి నీళ్లు, నిల్వ ఉండకుండా చూడాలన్నారు. వారంలో ఒకరోజు “ఫ్రైడే డ్రై డే “కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందాలని సూచించారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలన్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. పి. హెచ్. ఈ .ఓ కే .ఆర్. ప్రకాష్ , హెల్త్ సూపర్వైజర్ శివ శంకర్,హెల్త్ అసిస్టెంట్ ముని వెంకటప్ప, ఎం. ఎల్. హెచ్. పి. నవీన్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



