నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ–2025 నియామకాల్లో పారదర్శకత కోరుతూ వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ డీఎస్సీ మెరిట్ లిస్ట్‌ను ఎందుకు విడుదల చేయలేదని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నించారు.
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.
అలాగే శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ రైతులకు విడుదల చేయడం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు.



