డీఎస్సీ అక్రమాలపై నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం
పోలీసుల నోటీసుపై రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆగ్రహం
ఖాజీపేట ఆగష్టు 11
మైదుకూరులో సోమవారం నిర్వహించనున్న డీఎస్సీ-2025 అక్రమాలు, అవకతవకలపై నిరసన ర్యాలీకి వెళ్లొద్దంటూ ఖాజీపేట పోలీసులు ఆదివారం రాత్రి 9.11 గంటలకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి నోటీసు అందజేశారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని ఆయన స్వగృహంలో ఈ నోటీసును పోలీసులు అందించారు.
డీఎస్సీ-2025లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై తక్షణం సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తెలిపారు.
నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించడం సరికాదని ఆయన విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
అక్రమాలు, అన్యాయాలపై ఉద్యమించడం, నిరసన తెలియజేయడం ప్రతి పౌరుడి హక్కు అని రెడ్యం పేర్కొన్నారు. ప్రజల హక్కులను అడ్డుకునే అధికారం ప్రభుత్వానికి, పోలీసులకు లేదని అన్నారు.


