Tuesday, 22 September 2026
  • Home  
  • డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు.. ఖమ్మం కి చెందిన ప్రముఖ వైద్యుడు సజీవ దహనం
- ఖమ్మం

డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు.. ఖమ్మం కి చెందిన ప్రముఖ వైద్యుడు సజీవ దహనం

సూర్యాపేట/ ఖమ్మం సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఖమ్మంలోని మమత హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసుకర్తి జగదీశ్ కారులో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో మరెవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎస్సై అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతదేహం వివరాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సూర్యాపేట/ ఖమ్మం

సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఖమ్మంలోని మమత హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసుకర్తి జగదీశ్ కారులో చిక్కుకుని సజీవ దహనం అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో మరెవరైనా ఉన్నారా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎస్సై అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, మృతదేహం వివరాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.