Wednesday, 23 September 2026
  • Home  
  • టీచర్లపై దాడులు, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి: మొల్లి పెంటిరాజు
- విశాఖపట్నం

టీచర్లపై దాడులు, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి: మొల్లి పెంటిరాజు

విశాఖపట్నం, సెప్టెంబర్ 23 (పున్నమి ప్రతినిధి): రాష్ట్రంలో ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులు, అవమానకర వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు అన్నారు. సమాజానికి విద్యాబుద్ధులు నేర్పుతూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించాల్సింది పోయి వారిపై దూషణలు, బెదిరింపులు, దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు. నిబంధనల ప్రకారం ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాల పేరుతో దాడులు చేయడం, అవమానించడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఉపాధ్యాయులు తమ విధులను స్వేచ్ఛగా, భయరహితంగా నిర్వహించేలా ప్రభుత్వం భద్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. టీచర్లపై దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత ప్రవర్తన, దాడులను అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని, ముఖ్యంగా యువత ఉపాధ్యాయులకు అండగా నిలవాలని కోరారు. ఉద్యోగుల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న దాడులు, దౌర్జన్యాలను యువత ప్రశ్నించాలని పెంటిరాజు పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుయువత నాయకులు వియ్యపు నరేష్, అయినంపూడి గోపాల్ వర్మ, నర్సింగ్, ఉరుకూటి అప్పలరాజు, కోన రమణ, మైలపల్లి నర్సింగ్, నక్కా గంగరాజు, వంగలపూడి అప్పలరాజు, అమ్మోరు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23 (పున్నమి ప్రతినిధి): రాష్ట్రంలో ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులు, అవమానకర వ్యాఖ్యలు, అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు అన్నారు. సమాజానికి విద్యాబుద్ధులు నేర్పుతూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించాల్సింది పోయి వారిపై దూషణలు, బెదిరింపులు, దాడులకు పాల్పడటం బాధాకరమన్నారు.

నిబంధనల ప్రకారం ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై రాజకీయ కక్షలు, వ్యక్తిగత విభేదాల పేరుతో దాడులు చేయడం, అవమానించడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. ఉపాధ్యాయులు తమ విధులను స్వేచ్ఛగా, భయరహితంగా నిర్వహించేలా ప్రభుత్వం భద్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

టీచర్లపై దాడులకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత ప్రవర్తన, దాడులను అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని, ముఖ్యంగా యువత ఉపాధ్యాయులకు అండగా నిలవాలని కోరారు. ఉద్యోగుల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న దాడులు, దౌర్జన్యాలను యువత ప్రశ్నించాలని పెంటిరాజు పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా తెలుగుయువత నాయకులు వియ్యపు నరేష్, అయినంపూడి గోపాల్ వర్మ, నర్సింగ్, ఉరుకూటి అప్పలరాజు, కోన రమణ, మైలపల్లి నర్సింగ్, నక్కా గంగరాజు, వంగలపూడి అప్పలరాజు, అమ్మోరు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.