Friday, 26 June 2026
  • Home  
  • జూలై 2న కోడూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ సభ
- తిరుపతి

జూలై 2న కోడూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ సభ

రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి పంచాయతీ మంగంపేటలో జూలై 2న జరగనున్న వి.బి.జి రాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్–గ్రామీణ) పథకం ప్రారంభోత్సవ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. సభను అత్యంత వైభవంగా నిర్వహించి విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నాయకులు వెల్లడించారు.

రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లి పంచాయతీ మంగంపేటలో జూలై 2న జరగనున్న వి.బి.జి రాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్–గ్రామీణ) పథకం ప్రారంభోత్సవ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి సభాస్థలిని పరిశీలించారు. జాతీయ రహదారి పక్కన సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. సభను అత్యంత వైభవంగా నిర్వహించి విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని నాయకులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.