జూనియర్ కళాశాలల్లో అకడమిక్ ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
———————————————————————–
*విద్యార్థులు, అధ్యాపకుల హాజరును FRS ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలి*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఎఫ్ఆర్ఎస్ (FRS) ద్వారా ప్రవేశ, నిష్క్రమణ సమయాల్లో తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అకడమిక్ ఫ్రేమ్‌వర్క్, అసెస్మెంట్ టూల్ కిట్ లను కళాశాలల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఫిజిక్స్ (భౌతిక శాస్త్రం), కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం), మ్యాథ్స్(గణిత శాస్త్రం), బయాలజీ (జీవ శాస్త్రం), జూలజీ (జంతు శాస్త్రం), అకౌంటింగ్ సబ్జెక్టులకు సంబంధించిన అకడమిక్ ఫ్రేమ్‌వర్క్, అసెస్మెంట్ టూల్‌కిట్ లను అందించడం జరుగుతుందని తెలిపారు. వాటిని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందజేసి, వారి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో డీఐఈఓ జితేందర్ రెడ్డి, ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, తదితరులు పాల్గొన్నారు.




