పున్నమి
ఖమ్మం: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు నేడు (సోమవారం) ఉదయం 10 గంటలకు బీజేపీ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు నాయుడు రాఘవ, నల్లగట్ల ప్రవీణ్, నల్లమోతు నానీ తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయవాద భావజాలానికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించనున్నట్లు వెల్లడించారు.



