Tuesday, 15 September 2026
  • Home  
  • చేజర్ల: డివైడర్‌పైకి ఎక్కిన కారు.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల: డివైడర్‌పైకి ఎక్కిన కారు.

చేజర్ల మండలం ఆదురుపల్లి బస్టాండ్లో శనివారం కారు ప్రమాదానికి గురైంది. కలువాయి వైపు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి బస్టాండ్లోని డివైడర్‌పైకి ఎక్కింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదాన్ని గమనించిన గ్రామస్థులు కారును డివైడర్‌ నుంచి పక్కకు తొలగించారు. ఆదురుపల్లి బస్టాండ్లోని డివైడర్‌ వద్ద తరచూ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు తెలిపారు. డివైడర్‌ నిర్మాణం, రహదారి పరిస్థితులపై అధికారులు దృష్టి సారించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డివైడర్‌ వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.