Thursday, 10 September 2026
  • Home  
  • చరిత్ర క్షమించని చీకటి రోజు –అన్యాయాన్ని ఎదిరించిన ప్రజా పోరాటం
- విజయనగరం 

చరిత్ర క్షమించని చీకటి రోజు –అన్యాయాన్ని ఎదిరించిన ప్రజా పోరాటం

చరిత్ర క్షమించని చీకటి రోజు – అన్యాయాన్ని ఎదిరించిన ప్రజా పోరాటం విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 9.పున్నమి ప్రతినిధి శృంగవరపుకోట: 2023 సెప్టెంబర్ 9వ తేదీ తెలుగు రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామంగా నిలిచిందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, ఈ ఘటనపై ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని వారు గుర్తుచేశారు. ఎస్.కోట గడ్డపై హోరెత్తిన ఉద్యమం చంద్రబాబు నాయుడు అరెస్టు వార్త వెలువడిన వెంటనే శృంగవరపుకోట నియోజకవర్గంలోనూ నిరసనలు జరిగాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని టీడీపీ నేతలు తెలిపారు. పోలీసు ఆంక్షలు, నిర్బంధాలను ఎదుర్కొంటూ రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, కాగడాల ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ లలితకుమారి ప్రజా ఉద్యమాన్ని కొనసాగించారని తెలిపారు. ప్రజాతీర్పుతో మారిన రాజకీయ పరిస్థితులు చంద్రబాబు అరెస్టు అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించాయని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ప్రజలు తమ ఓటు ద్వారా అప్పటి ప్రభుత్వ విధానాలపై తీర్పు ఇచ్చారని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారని తెలిపారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో కోళ్ల లలితకుమారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె అనుచరులు తెలిపారు. 2023లో జరిగిన పరిణామాలను స్మరించుకుంటూ, ప్రజాస్వామ్య విలువలు, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ఆ సమయంలో ఎస్.కోటలో సాగిన ప్రజా ఉద్యమం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని వారు తెలిపారు.

చరిత్ర క్షమించని చీకటి రోజు – అన్యాయాన్ని ఎదిరించిన ప్రజా పోరాటం

విజయనగరం జిల్లా బ్యూరో రమణ సెప్టెంబర్ 9.పున్నమి ప్రతినిధి

శృంగవరపుకోట:
2023 సెప్టెంబర్ 9వ తేదీ తెలుగు రాజకీయ చరిత్రలో ఒక కీలక పరిణామంగా నిలిచిందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని, ఈ ఘటనపై ప్రజాస్వామ్యవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని వారు గుర్తుచేశారు.
ఎస్.కోట గడ్డపై హోరెత్తిన ఉద్యమం
చంద్రబాబు నాయుడు అరెస్టు వార్త వెలువడిన వెంటనే శృంగవరపుకోట నియోజకవర్గంలోనూ నిరసనలు జరిగాయి. ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నాయకత్వంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారని టీడీపీ నేతలు తెలిపారు.
పోలీసు ఆంక్షలు, నిర్బంధాలను ఎదుర్కొంటూ రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, కాగడాల ప్రదర్శనలు తదితర కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ లలితకుమారి ప్రజా ఉద్యమాన్ని కొనసాగించారని తెలిపారు.
ప్రజాతీర్పుతో మారిన రాజకీయ పరిస్థితులు
చంద్రబాబు అరెస్టు అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించాయని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ప్రజలు తమ ఓటు ద్వారా అప్పటి ప్రభుత్వ విధానాలపై తీర్పు ఇచ్చారని, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారని తెలిపారు.
శృంగవరపుకోట నియోజకవర్గంలో కోళ్ల లలితకుమారిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె అనుచరులు తెలిపారు.
2023లో జరిగిన పరిణామాలను స్మరించుకుంటూ, ప్రజాస్వామ్య విలువలు, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి. ఆ సమయంలో ఎస్.కోటలో సాగిన ప్రజా ఉద్యమం నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.