చంద్రగిరి ఆగస్టు 27 పున్నమి ప్రతినిధి
చంద్రగిరి మండలం నూరు జంక్షన్ ఫ్లైఓవర్పై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. TVS XL వాహనంపై తండ్రి, కుమారుడు తిరుపతి వైపు బయల్దేరారు. చిత్తూరు వైపు నుంచి బైకుపై వచ్చిన దివ్యాంగుడు తండ్రి, కుమారుడిని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో దివ్యాంగుడు చనిపోగా.. తండ్రి, కుమారుడికి స్వల్పగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

