ప్రతి ఇంటి నుంచి పొంగళ్ళు సమర్పించిన మహిళలు
రామచంద్రపురం ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి
రామచంద్రపురం మండలం సికె పల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలో గ్రామ మహిళలు శుక్రవారం వరలక్ష్మి దేవి వ్రతంలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటి దగ్గర అష్టైశ్వర్యాలకు మూల దేవత అయిన శ్రీ వరలక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుని అనంతరం గ్రామ శ్రేయస్సు కొరకు గ్రామంలో ప్రజలు, పాడి పశువులు అందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామ దేవత శ్రీ నాగాలమ్మ తల్లికి ప్రతి ఇంటి నుంచి పొంగళ్ళు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నాగదేవతలకు పాలు పెరుగు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమ పూలు పండ్లు ప్రతి ఒక్కరూ అమ్మవారికి నైవేద్యంగా తీపి పొంగలి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామ దేవత శ్రీ నాగాలమ్మ తల్లికి ప్రదక్షిణలు చేసి వారి కుటుంబము మరియు గ్రామము సుభిక్షంగా ఉండాలని గ్రామంలో ఎలాంటి దుష్టశక్తులు, అనారోగ్య సమస్యలు, పాడి పశువులకు ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రైతులకు పొలాలలో పాముల నుంచి అనునిత్యం కాపాడాలని కోరుకున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం నాగదేవతలకు అనునిత్యం పూజలు చేస్తామని తెలిపారు. నాగదేవత మమ్మల్ని మా పిల్లల్ని మా గ్రామాన్ని అనునిత్యం కాపాడి మమ్మల్ని ఆశీర్వదించి సుఖశాంతులు కల్పిస్తుందని వాళ్ల అపార నమ్మకమని తెలిపారు.


