రామచంద్రాపురం ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి
శ్రీ శక్తి పీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరీ “శక్తి గురు” *శ్రీ శ్రీ శ్రీ రమ్యానంద భారతీ మహాస్వామిని* వారి దివ్య ఆశీస్సులతో, *వాడ వాడలా వారాహీ* కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం, అనుపల్లి పంచాయతీ, రేకలచేను గ్రామంలోని జన్మస్థల శివాలయం నందు శ్రీ వారాహి దేవి కుంకుమార్చన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం లో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు, గ్రామస్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సంకల్ప హాస్పిటల్ ఫౌండర్ శ్రీ సోమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… *శ్రీ శక్తి పీఠం* వారు నిర్వహిస్తున్న *’వాడ వాడలా వారాహీ’* కార్యక్రమం ప్రజలలో ఆధ్యాత్మిక భావాన్ని, భక్తి విశ్వాసాలను పెంపొందించేలా ఎంతో అద్భుతంగా సాగుతోందని కొనియాడారు.
పూజా కార్యక్రమాల అనంతరం విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాల వితరణ గావించారు.
