Friday, 25 September 2026
  • Home  
  • గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం
- కడప

గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం

గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 కడప: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సాప్) కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్ఆర్ టీయూసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కడప ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు ఎం. జాషువా, కడప నగర అధ్యక్షులు ఎన్. నాగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. శ్రీధర్, రాష్ట్ర జాయింట్ కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి, కడప నగర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ ఖాన్, కమలాపురం మండల అధ్యక్షులు లింగారెడ్డి ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమస్యపై స్పష్టత ఇవ్వకుండా ఉద్యమకారులపై పోలీసు చర్యలకు పాల్పడటం సరికాదని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని, నియామకాలకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గౌతమ్ రెడ్డిపై పోలీసుల లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం

పున్నమి ప్రతినిధి
సెప్టెంబర్ 22

కడప: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సాప్) కార్యాలయం వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్ఆర్ టీయూసీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

ఈ మేరకు కడప ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు ఎం. జాషువా, కడప నగర అధ్యక్షులు ఎన్. నాగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ. శ్రీధర్, రాష్ట్ర జాయింట్ కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి, కడప నగర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ ఖాన్, కమలాపురం మండల అధ్యక్షులు లింగారెడ్డి ప్రకటన విడుదల చేశారు.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమస్యపై స్పష్టత ఇవ్వకుండా ఉద్యమకారులపై పోలీసు చర్యలకు పాల్పడటం సరికాదని వారు పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని, నియామకాలకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.