పున్నమి ప్రతినిధి,తిరుపతి జూలై 29
గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్‌లోని షిరిడీ సాయిబాబా ఆలయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీస్సులు పొందారు
రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






