ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్)
గురు పౌర్ణిమ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్ శ్రీ రామచంద్రుల గురవయ్య గారి బ్రాహ్మణ సత్రము మరియు శృంగేరి శంకరమఠంలో ప్రత్యేక గురుపూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి, అలాగే గురు పరంపరలోని పీఠాధిపతులైన శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి మరియు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు సమర్పించి ఆశీస్సులు పొందారు.
గురు పౌర్ణిమ సందర్భంగా గురువుల పట్ల కృతజ్ఞత, భక్తి, గౌరవ భావాలను చాటుతూ నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురుపూజలు భారతీయ సనాతన సంప్రదాయంలో విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నాయని, గురువుల ఆశీస్సులు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఈ సందర్భంగా గేంటెల విద్యాసాగర్ పేర్కొన్నారు. గురు పౌర్ణిమను వ్యాస పూర్ణిమగా కూడా ఆచరిస్తారు.



