లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న ఏకదంతుడు
గురువారం గంగమ్మ ఒడిలోకి చేరాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ఆలయాలు, వార్డుల్లో ప్రత్యేక పూజలు, కీర్తనలు, భజనలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు విస్తారంగా కురవాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని గణనాథుడిని వేడుకున్నారు.
నిమజ్జన కార్యక్రమంలో యువకులు భక్తి భజనలు, డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం ఏకదంతుడి విగ్రహాన్ని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.
గంగమ్మ ఒడిలోకి వినాయకుడు
లోకేశ్వరం మండలంలోని రాజుర గ్రామంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న ఏకదంతుడు గురువారం గంగమ్మ ఒడిలోకి చేరాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆలయాలు, వార్డుల్లో ప్రత్యేక పూజలు, కీర్తనలు, భజనలు నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుని పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు విస్తారంగా కురవాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని గణనాథుడిని వేడుకున్నారు. నిమజ్జన కార్యక్రమంలో యువకులు భక్తి భజనలు, డీజే పాటలకు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం ఏకదంతుడి విగ్రహాన్ని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు.

