ఖమ్మం మే
పున్నమి జిల్లా ప్రతి నిధి
ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి ప్రారంభించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ తదితర రంగాలకు చెందిన 80 కంపెనీలు పాల్గొన్నాయి. సుమారు 3,200కు పైగా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు మే 23న నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత ప్రైవేట్ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయకుండా, లభిస్తున్న అవకాశాలను వినియోగించుకుని అనుభవం సంపాదించాలని సూచించారు.


