Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

కోడూరు గ్రామ పంచాయతీ వర్కర్స్ రెండు నెలల జీతాలు చెల్లించాలి! సిఐటియు డిమాండ్!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కోడూరు గ్రామ పంచాయతీ వర్కర్స్ రెండు నెలల జీతాలు చెల్లించాలి! సిఐటియు డిమాండ్!!

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వే కోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరులో గ్రామపంచాయతీ కార్మికులకు జూన్ జూలై, రెండు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి, పి.
  • జాన్ ప్రసాద్, డిమాండ్ చేశారు.
  • 27 వినాయక చవితి పండుగ జరుగుతున్న, కార్మికుల పస్తులతో ఉండాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రైల్వే కోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరులో గ్రామపంచాయతీ కార్మికులకు జూన్ జూలై, రెండు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి, పి. జాన్ ప్రసాద్, డిమాండ్ చేశారు. 27 వినాయక చవితి పండుగ జరుగుతున్న, కార్మికుల పస్తులతో ఉండాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారి గడవని కార్మికులకు, కనీసం, నెలకు జీతం ఐదో తేదీ లోగా ఇవ్వాలని కోరారు. వారికి వచ్చే జీతం, సిఐటియు పోరాట ఫలితంగా, 13600 ఇస్తున్నారని, కొందరికి స్వచ్ఛభారత్ కార్మికులకు మాత్రం, 6000 నుంచి 10000 పెంచేయడం జరిగినదని. ఇద్దరు ఒకే పని చేస్తున్న, జీతాల్లో వ్యత్యాసం ఉందని, తక్షణం అందరికీ ఒకే వేతన ఇవ్వాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో, పంచాయతీలో, ఒకే రకమైన పనిచేస్తున్నారని, మున్సిపాలిటీకి ఇచ్చే వేతనాలే ఇవ్వాలన్నారు.తక్షణమే ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *