కుబీర్, సెప్టెంబరు 14 (పున్నమి ప్రతినిధి):కుబీర్ మండల కేంద్రంలోని ప్రాచీన విఠలేశ్వర ఆలయంలో అరుదైన కర్ర గణపయ్య కొలువుదీరారు. వినాయక నవరాత్రుల సమయంలో మాత్రమే దర్శనమిచ్చే ఈ వరసిద్ధి వినాయకుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ముడుపు కడితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. నవరాత్రుల ముగింపు సందర్భంగా నిమజ్జనం రోజున వాగు నీటితో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం విగ్రహాన్ని ఆలయంలోని ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు. అరుదైన కర్ర గణపయ్యను దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 🙏

కుబీర్‌లో కొలువైన అరుదైన శ్రీ వరసిద్ధి వినాయక, (కర్ర గణపయ్య).