Friday, 25 September 2026
  • Home  
  • కాకరవాయిలో వైభవంగా వినాయక నిమజ్జనం
- ఖమ్మం

కాకరవాయిలో వైభవంగా వినాయక నిమజ్జనం

భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్ర.. మార్మోగిన గణపతి నామస్మరణ తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ వినాయక మండపాల వద్ద ప్రతిష్ఠించిన గణనాథుల విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి తరలించారు. వినాయక విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సాహంగా సాగింది. యువత, చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలు, గణపతి నామస్మరణలతో సందడి చేశారు. భక్తులు “గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రా” అంటూ నినాదాలు చేశారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువత సమన్వయంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. Uploaded Video:

భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్ర.. మార్మోగిన గణపతి నామస్మరణ

తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ వినాయక మండపాల వద్ద ప్రతిష్ఠించిన గణనాథుల విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనానికి తరలించారు.

వినాయక విగ్రహాలతో నిర్వహించిన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఉత్సాహంగా సాగింది. యువత, చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిగీతాలు, గణపతి నామస్మరణలతో సందడి చేశారు. భక్తులు “గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రా” అంటూ నినాదాలు చేశారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండపాల నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువత సమన్వయంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.