కుంటాల: తెలంగాణ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. కుంటాల మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం ఒక వర్గానికో, ఒక సమాజానికో పరిమితమైనది కాదన్నారు. నిజాం పాలనలో అణచివేతకు గురైన ప్రజల హక్కుల కోసం ఆమె ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి ప్రజల కోసం నిలబడిన ఐలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శప్రాయమన్నారు.
చాకలి ఐలమ్మ ఆశయాలను కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ఆమె స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆమె పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు, సంఘ సభ్యులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

అణగారిన ప్రజల హక్కుల కోసం ఐలమ్మ పోరాటం.. నేటి తరాలకు స్ఫూర్తిదాయకం…
కుంటాల: తెలంగాణ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. కుంటాల మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటం ఒక వర్గానికో, ఒక సమాజానికో పరిమితమైనది కాదన్నారు. నిజాం పాలనలో అణచివేతకు గురైన ప్రజల హక్కుల కోసం ఆమె ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి ప్రజల కోసం నిలబడిన ఐలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శప్రాయమన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ఆమె స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ఆమె పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు, సంఘ సభ్యులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

