ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 16 (పున్నమి ప్రతినిధి).మనుబోలు, జూన్ 16: మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామ సచివాలయంలో ఎస్‌ఐఆర్ (SIR) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మనుబోలు మండల బీజేపీ అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి పాల్గొని ఓటర్ల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వ్యక్తులు, గ్రామంలో నివసించని వారు, డబుల్ ఎంట్రీలు ఉన్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితాను రూపొందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ నాయకులు మరియు పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలి: వాసిరెడ్డి రామిరెడ్డి