Thursday, 9 July 2026
  • Home  
  • ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందవద్దు…….
- నిజామాబాద్

ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందవద్దు…….

ఆర్మూర్ పట్టణంలో 33 వార్డులో సోమవారం రోజు ఓటరు జాబితా ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని, ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని 33వ వార్డు కౌన్సిలర్ రాణి సుమన్ తెలిపారు. 33వ వార్డులో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న విధులను పరిశీలించి, ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రాణి సుమన్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, సవరణలు వంటి అంశాలపై ప్రజలు అపోహలకు గురికాకుండా అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా అధికారులు పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా సహకరించాలని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్నారని రాణి సుమన్ తెలిపారు.

ఆర్మూర్ పట్టణంలో 33 వార్డులో సోమవారం రోజు ఓటరు జాబితా ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా కొనసాగుతోందని, ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని 33వ వార్డు కౌన్సిలర్ రాణి సుమన్ తెలిపారు.
33వ వార్డులో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) నిర్వహిస్తున్న విధులను పరిశీలించి, ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా రాణి సుమన్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, సవరణలు వంటి అంశాలపై ప్రజలు అపోహలకు గురికాకుండా అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా అధికారులు పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా సహకరించాలని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బీఎల్‌ఓలు, సంబంధిత అధికారులు అప్రమత్తంగా పనిచేస్తున్నారని రాణి సుమన్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.