Saturday, 26 September 2026
  • Home  
  • ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ఒక్కరే అధికారి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ఒక్కరే అధికారి

ఉదయగిరి: ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 208 అంగన్వాడీ కేంద్రాలు, తొమ్మిది సెక్టార్లు ఉన్నాయి. ఇటీవల సీడీపీవో బదిలీ కావడంతో ప్రస్తుతం ప్రాజెక్టు మొత్తానికి ఒకే ఒక్క సూపర్వైజర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇంత విస్తృత పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సిబ్బంది కొరత కారణంగా కేంద్రాల నిర్వహణ, పథకాల అమలు, రికార్డుల పరిశీలనపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న సీడీపీవో పోస్టుతో పాటు అవసరమైన సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసి పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు సేవలు మరింత మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.