కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వింజమూరులో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. గత రెండేళ్లలో ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి సుమారు రూ.650 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర పథకాల ద్వారా వేలాది మందికి లబ్ధి చేకూరిందన్నారు. దుత్తలూరు మండలంలో 1,400 ఎకరాల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులతో ఐదు భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఉదయగిరి అభివృద్ధికి రూ.650 కోట్లు – దుత్తలూరులో రూ.2,500 కోట్లతో ఐదు పరిశ్రమలు: ఎమ్మెల్యే కాకర్ల సురేష్