ఉదయగిరి: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయగిరిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైస్కూల్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు 200 మీటర్ల త్రివర్ణ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ఉదయగిరి వీధులు మార్మోగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, దేశ సమైక్యతకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఉదయగిరిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భారీ ర్యాలీ