అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి మండలం (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని దార్లపూడి గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ప్రతిరోజూ అనకాపల్లి జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక అర్చనలు, హోమాల్లో పాల్గొంటూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఈ క్షేత్రంలో స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవిస్తే కోరుకున్న మనోరథాలు నెరవేరుతాయని, శుభఫలితాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ నమ్మకంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారి అనుగ్రహంతో జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని పలువురు భక్తులు తమ అనుభవాలను వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆలయంలో ప్రతిరోజూ నిత్యారాధనలు, హోమాలు, విశేష పూజలు, అన్నసమారాధన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రేజేటి పవన్ కుమారా చార్యులు తెలిపారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచుతూ ఆలయ సేవలను నిరంతరం కొనసాగిస్తున్నామని చెప్పారు. రోజురోజుకూ ఆలయ మహిమ గురించి తెలుసుకుని వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.



