-నెల్లూరు: స్వర్ణాల చెరువులో త్వరలో బోటింగ్ సౌకర్యం. ఈనెల 25న ప్రారంభించనున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని స్వర్ణాల చెరువులో బోటు షికారు ఏర్పాట్లను పర్యవేక్షించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 25వ తేది సాయంత్రం 5 గంటలకు స్వర్ణాల చెరువులో బోటింగ్ ను జిల్లా కలెక్టర్ ,ఇతర అధికారులు అందరం కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. స్వర్ణాల చెరువుకు ఎంతో విశిష్టత ఉంది.విజయవాడ తరువాత నెల్లూరు స్వర్ణాల చెరువుకు 8 బోట్లు రావడం చాలా గర్వకారణం అని అన్నారు. స్వర్ణాల చెరువులో ఆహ్లాదకరంగా, సంతోషంగా ప్రజలందరూ కుటుంబసభ్యులతో కలసి పాల్గొనండి అని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత టూరిజం ను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారని, స్థానిక శాసనసభ్యుడిగా టూరిజం ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.


