Tuesday, 26 May 2026
  • Home  
  • ఆత్మకూరులో రాష్ట్రానికే ఆదర్శంగా మహానాడు ఏర్పాట్లు
- News - Updates - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో రాష్ట్రానికే ఆదర్శంగా మహానాడు ఏర్పాట్లు

11 క్లస్టర్లలో మంత్రి ఆనం విస్తృత పరిశీలన అధునాతన టెక్నాలజీతో వర్చువల్ మహానాడుకు భారీ సన్నాహాలు ఆత్మకూరు, మే 26 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిర్వహించేందుకు ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో పర్యటించి మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. వర్చువల్ విధానంలో నిర్వహించనున్న ఈ మహానాడును విజయవంతం చేసేందుకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, యువనేత నారా లోకేష్ సరికొత్త ఆలోచనలకు అనుగుణంగా మహానాడును ప్రజలకు మరింత చేరువ చేసేలా డిజిటల్ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో అత్యాధునిక ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రత్యక్ష ప్రసార సదుపాయాలతో వేదికలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మార్గదర్శక మహానాడుగా ఆత్మకూరు నిలవాలని లక్ష్యంగా పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో సంగం మండలం సిద్ధిపురం, సంగం, ఏఎస్‌పేట మండలం చిరమన, ఏఎస్‌పేట, ఆత్మకూరు రూరల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ కళ్యాణ మండపం, పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపం, చేజర్ల మండల కేంద్రం సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మహానాడు వేదికలను మంత్రి ఆనం పరిశీలించారు. ప్రతి వేదిక వద్ద అతిథుల కూర్చునే ఏర్పాట్లు, కార్యకర్తల సౌకర్యాలు, భోజనం, అల్పాహారం, టీ, తాగునీరు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత నాయకులు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.మహానాడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తినా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక మహోత్సవం లాంటిదని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి మహానాడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడును సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఆత్మకూరు నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో పార్టీ కార్యకర్తలు, నాయకులు మహానాడును విజయవంతం చేసేందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నారని మంత్రి ఆనం కొనియాడారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.మహానాడు సందర్భంగా పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేయాలని మంత్రి ఆనం అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం కీలకమని, యువతకు నారా లోకేష్ కొత్త దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు.పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఆత్మకూరు నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుందని, ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా మహానాడు నిర్వహిస్తామని మంత్రి ఆనం ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అయన వెంట సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తుళ్ళూరి గిరినాయుడు , ఆనం లీలా కైవల్య రెడ్డి మరియు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .


11 క్లస్టర్లలో మంత్రి ఆనం విస్తృత పరిశీలన

అధునాతన టెక్నాలజీతో వర్చువల్ మహానాడుకు భారీ సన్నాహాలు

ఆత్మకూరు, మే 26 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి)

తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిర్వహించేందుకు ఆత్మకూరు నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో పర్యటించి మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. వర్చువల్ విధానంలో నిర్వహించనున్న ఈ మహానాడును విజయవంతం చేసేందుకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భారీ ఏర్పాట్లు చేపడుతున్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో, యువనేత నారా లోకేష్ సరికొత్త ఆలోచనలకు అనుగుణంగా మహానాడును ప్రజలకు మరింత చేరువ చేసేలా డిజిటల్ టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో అత్యాధునిక ఎల్ఈడి స్క్రీన్లు, సౌండ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ప్రత్యక్ష ప్రసార సదుపాయాలతో వేదికలను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే మార్గదర్శక మహానాడుగా ఆత్మకూరు నిలవాలని లక్ష్యంగా పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో సంగం మండలం సిద్ధిపురం, సంగం, ఏఎస్‌పేట మండలం చిరమన, ఏఎస్‌పేట, ఆత్మకూరు రూరల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ కళ్యాణ మండపం, పట్టణంలోని రవితేజ కళ్యాణ మండపం, చేజర్ల మండల కేంద్రం సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న మహానాడు వేదికలను మంత్రి ఆనం పరిశీలించారు. ప్రతి వేదిక వద్ద అతిథుల కూర్చునే ఏర్పాట్లు, కార్యకర్తల సౌకర్యాలు, భోజనం, అల్పాహారం, టీ, తాగునీరు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై సంబంధిత నాయకులు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.మహానాడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వర్షం, విద్యుత్ అంతరాయం వంటి సమస్యలు తలెత్తినా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక మహోత్సవం లాంటిదని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి మహానాడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలిచిందని పేర్కొన్నారు. ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడును సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఆత్మకూరు నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో పార్టీ కార్యకర్తలు, నాయకులు మహానాడును విజయవంతం చేసేందుకు ఉత్సాహంగా పనిచేస్తున్నారని మంత్రి ఆనం కొనియాడారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రతి నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.మహానాడు సందర్భంగా పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేయాలని మంత్రి ఆనం అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం కీలకమని, యువతకు నారా లోకేష్ కొత్త దిశానిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు.పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఆత్మకూరు నియోజకవర్గం ఎప్పుడూ ముందుంటుందని, ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచేలా మహానాడు నిర్వహిస్తామని మంత్రి ఆనం ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అయన వెంట సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తుళ్ళూరి గిరినాయుడు , ఆనం లీలా కైవల్య రెడ్డి మరియు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.