ప్రైవేట్ యాప్‌ల దోపిడీతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల బతుకులు
*ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా.. వంద రూపాయలు కూడా రాని దుస్థితి.!*
*రాపిడో, ఓలా, ఉబర్ యాప్‌లపై జనగామ ఆటో కార్మికుల ఆగ్రహం.!*
*ఆటో కార్మికుల బతుకులు మారాలంటే.. అది ‘తీన్మార్ మల్లన్న’తోనే సాధ్యం.!*
*టీఆర్పీ జిల్లా నాయకుల కు ఆటో కార్మికుల వినతి.. అండగా ఉంటాం టీఆర్పీ హామీ*
*ఆటో కార్మికులకు అండగా తీన్మార్ మల్లన్న : బిక్షపతి, సదానందం..* రాపిడో, ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌ల వల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని జనగామ జిల్లా ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యాప్‌ల దోపిడీ రవాణా వ్యవస్థను తక్షణమే నిర్మూలించి, తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులకు వినతిపత్రం సమర్పించారు.
జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాచర్ల బిక్షపతి, జిల్లా అధ్యక్షులు కట్ట సదానందం వారితో ఆటో కార్మికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ…రోజురోజుకూ పెరుగుతున్న ప్రైవేట్ బైక్ టాక్సీలు, ఓలా, ఉబర్ యాప్‌ల వల్ల మాకు కిరాయిలు దొరకడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా ఇంటికి కనీసం వంద రూపాయలు కూడా తీసుకెళ్లలేని దుస్థితి ఏర్పడింది. మా బాధలను అర్థం చేసుకుని, ఈ అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే సత్తా కేవలం పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు మాత్రమే ఉంది. ఆటో కార్మికుల బతుకులు మారాలంటే అది మల్లన్నతోనే సాధ్యం” అని వారు ఘంటాపథంగా నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ… ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న ప్రైవేట్ యాప్‌ల అంశాన్ని తక్షణమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శ్రమజీవులైన ఆటో కార్మికులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు పోరాడుతామని స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అక్తర్ పాషా రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అఫ్సర్ గారు ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షులు జేరిపోతుల కుమార్,పట్టణ కమిటీ అధ్యక్షులు బాల్దే శ్రీశైలం,ప్రధాన కార్యదర్శి బూడిద ప్రశాంత్ ,కార్యదర్శులు గనిపక రవి ,బండ్రు మల్లేశం కందుల రాజు,తిప్పటి బాలస్వామి ,చిర కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఆటో కార్మికుల బతుకులు మారాలంటే అది తీన్మార్ మల్లన్న తోనే సాధ్యం :టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, నియోజకవర్గం ఇంచార్జి మాచర్ల బిక్షపతి
ప్రైవేట్ యాప్‌ల దోపిడీతో రోడ్డున పడ్డ ఆటో కార్మికుల బతుకులు *ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా.. వంద రూపాయలు కూడా రాని దుస్థితి.!* *రాపిడో, ఓలా, ఉబర్ యాప్‌లపై జనగామ ఆటో కార్మికుల ఆగ్రహం.!* *ఆటో కార్మికుల బతుకులు మారాలంటే.. అది ‘తీన్మార్ మల్లన్న’తోనే సాధ్యం.!* *టీఆర్పీ జిల్లా నాయకుల కు ఆటో కార్మికుల వినతి.. అండగా ఉంటాం టీఆర్పీ హామీ* *ఆటో కార్మికులకు అండగా తీన్మార్ మల్లన్న : బిక్షపతి, సదానందం..* రాపిడో, ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్‌ల వల్ల తమ బతుకులు రోడ్డున పడ్డాయని జనగామ జిల్లా ఆటో కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ యాప్‌ల దోపిడీ రవాణా వ్యవస్థను తక్షణమే నిర్మూలించి, తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో నాయకులకు వినతిపత్రం సమర్పించారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాచర్ల బిక్షపతి, జిల్లా అధ్యక్షులు కట్ట సదానందం వారితో ఆటో కార్మికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ…రోజురోజుకూ పెరుగుతున్న ప్రైవేట్ బైక్ టాక్సీలు, ఓలా, ఉబర్ యాప్‌ల వల్ల మాకు కిరాయిలు దొరకడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించినా ఇంటికి కనీసం వంద రూపాయలు కూడా తీసుకెళ్లలేని దుస్థితి ఏర్పడింది. మా బాధలను అర్థం చేసుకుని, ఈ అన్యాయమైన వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే సత్తా కేవలం పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు మాత్రమే ఉంది. ఆటో కార్మికుల బతుకులు మారాలంటే అది మల్లన్నతోనే సాధ్యం” అని వారు ఘంటాపథంగా నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ… ఆటో కార్మికుల పొట్ట కొడుతున్న ప్రైవేట్ యాప్‌ల అంశాన్ని తక్షణమే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. శ్రమజీవులైన ఆటో కార్మికులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు పోరాడుతామని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అక్తర్ పాషా రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అఫ్సర్ గారు ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షులు జేరిపోతుల కుమార్,పట్టణ కమిటీ అధ్యక్షులు బాల్దే శ్రీశైలం,ప్రధాన కార్యదర్శి బూడిద ప్రశాంత్ ,కార్యదర్శులు గనిపక రవి ,బండ్రు మల్లేశం కందుల రాజు,తిప్పటి బాలస్వామి ,చిర కుమార్ తదితరులు పాల్గొన్నారు

