నంద్యాల, క్రాంతినగర్ శ్రీ శాంతినికేతన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆచార్య చాణక్య బిజినెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఒలింపియాడ్ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించారు.9వ తరగతి విద్యార్థి జి. సి .సంతోష్ రాష్ట్రస్థాయిలో ద్వితీయ ర్యాంక్ 8వ తరగతి విద్యార్థి ఎన్.కార్తీక్ రాష్ట్రస్థాయిలో తృతీయ ర్యాంక్ సాధించి పాఠశాల గౌరవాన్ని మరింత పెంచారు.ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల చైర్మన్ సుధాకర్ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి, వారి ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు మెమెంటో మరియు మెడల్‌ను అందజేసి ఘనంగా సత్కరించారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఐఐటీ ప్రోగ్రాం బృందం మరియు ఉపాధ్యాయులను కూడా చైర్మన్ సుధాకర్ అభినందించారు.ఈ సందర్భంగా చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ, “మా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రెండు ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. విద్యార్థుల ప్రతిభకు, ఉపాధ్యాయుల కృషికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధించేలా వారికి నిరంతరం ప్రోత్సాహం మరియు మార్గదర్శకత్వం అందిస్తాము” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొని రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఆచార్య చాణక్య బిసినెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో శాంతినికేతన్ విద్యార్థుల ప్రభంజనం*